ముమ్మరంగా వాహనాల తనిఖీలు

నవతెలంగాణ- భిక్కనూర్
ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సందర్భంగా భిక్కనూరు పట్టణంలోని 44వ జాతీయ రహదారిపై స్థానిక టోల్ ప్లాజా వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో నగదును వాహనాలలో తీసుకెళ్లరాదని, తనిఖీల సమయంలో పోలీసులకు వాహనదారులు సహకరించాలని తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్ఐ సాయికుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Spread the love