Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటర్, టెన్త్ రీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటర్, టెన్త్ రీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

ఇంటర్, 10వ, తరగతి వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రామకృష్ణరావు అన్నారు. మంగళవారం రాష్ట సచివాలయం నుండి ఇంటర్ 10వ. తరగతి పరిక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్ పి లు, విద్యాశాఖ అధికారులు, వైద్యశాఖ అధికారులు,ఆర్ టి సి అధికారులు, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి కార్యదర్శులు,కమిషనర్లతో కలిసి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ నెల 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్ ప్రధమ, ద్వితీయ పరిక్షలు వుంటాయని, 10వ. తరగతి వార్షిక పరిక్షలు, మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు ఉంటాయని, ప్రతి పరిక్ష కేంద్రంలో త్రాగునీరు, పారిశుద్యం, వెలుతురు, సరిపడా పర్నిచర్ వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రం వద్ద మెడికల్ క్యాంపు, పోలీస్ బందోబస్తు, ప్రశ్న ,జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తు మద్య పరిక్ష కేంద్రాలకు  తరలించాలన్నారు.విద్యార్ధులు  పరిక్ష సమయానికి చేరుకునేలా, ఆర్ టి సి అధికారులు బస్సులు నడపాలన్నారు.

ఈ వీసీ లో జిల్లా కలెక్టర్ హనుమంత రావు, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పి లక్ష్మీనారాయణ,లతో కలిసి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వీసీ అనంతరం  ఇంటర్మీడియట్,ఎస్‌.ఎస్‌.సి,పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన సన్నద్ధతపై .. జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్ని లైన్ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలన్నారు .ఈ సంవత్సరం జిల్లా లో ఇంటర్మీడియట్ లో మొత్తం 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు గాను 12,813 మంది విద్యార్థులు  ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరుకానున్నారన్నారు . పదవ తరగతి పరీక్షకు 50 పరీక్షా కేంద్రాలు, 8933 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పరీక్షా కేంద్రాలలో తగిన ఫర్నిచర్‌, తాగునీరు, పారిశుద్ధ్యం, సరైన వెలుతురు, గాలి ప్రసరణ మరియు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల భద్రత విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పోలీస్ శాఖ అధికారులకు పరీక్షా కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, సున్నితమైన కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల రవాణాకు అవసరమైన పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని  తెలిపారు. రవాణా శాఖ ద్వారా గ్రామీణ మరియు దూర ప్రాంతాల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన బస్సు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వైద్య శాఖ పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స సదుపాయాలు, అత్యవసర సేవలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు పరీక్షా కేంద్రాల పరిసరాల్లో పరిశుభ్రత, తాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ పరీక్షల సమయంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగించేలా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.  పారదర్శక నిర్వహణ కోసం ప్రతి పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని, అదనంగా ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ప్రత్యేక తనిఖీ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేపడతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.

పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులందరికీ  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, ఇంటర్మీడియట్ అధికారి రమణి, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -