Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

- Advertisement -

ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్ధులు..
క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించిన సిబ్బంది
నవతెలంగాణ – చిన్నకోడూరు 

ఇంటర్ మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రారంభం అయ్యాయి. మండల కేంద్రమైన చిన్నకోడూరు లోని జూనియర్ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి పరీక్ష కావడంతో విద్యార్దులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్దులను క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తీసుకెళ్లకుండా పరిశీలించి లోపలికి అనుమతించారు.

బాలురు కు పురుషులు, బాలికలకు మహిళా సిబ్బంది చెక్ చేసి లోపలికి అనుమతించారు. మొదటి పరీక్ష కావడంతో విద్యార్దులు వెంట తల్లి తండ్రులు వచ్చి పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లారు..విద్యార్దులు ఉత్సాహంగా ఒకరిని ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ లోపలికి వెళ్ళారు. ఉదయం చేరుకున్న విద్యార్ధులు వారి యొక్క హాల్ టికెట్స్ నెంబర్ల సరి చూసుకొని పరీక్ష కేంద్రం లోపలికి వెళ్ళారు. 195 విద్యార్థులకు గాను 193మంది విద్యార్థులు హాజరు కాగా మరో ఇద్దరు విద్యార్థులు గైరాజరైనట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -