Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సజావుగా సాగుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు 

సజావుగా సాగుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ ద్వితీయ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయనీ ఇంటర్మీడియట్ నోడల్  అధికారం షేక్ సలాం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. .జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, గురుకులాల్లో పరీక్షలు కట్టుదిట్టమైన పర్యవేక్షణలో  నిర్వహిస్తున్నామన్నారు.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,878 మంది విద్యార్థులు నమోదు కాగా, అందులో 7,733 మంది హాజరయ్యారు. కొద్ది మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, సీసీ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయగలిగేలా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -