Wednesday, January 21, 2026
E-PAPER
Homeక్రైమ్కామారెడ్డిలో అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

కామారెడ్డిలో అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

- Advertisement -

– దొంగిలించిన ద్విచక్ర వాహనాలు, పరికరాలు స్వాధీనం
నవతెలంగాణ – కామారెడ్డి

మహారాష్ట్రకు చెందిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి, దొంగతనాలకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాలు, ఇనుప రాడ్లు, మాస్కులు, గ్లౌజులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర  తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  .. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 8, 9 తేదీల్లో నాలుగు షాపుల షట్టర్లు లేపి దొంగతనాలు చేయడంతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయని అన్నారు.

ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సీసీ కెమెరాలు సాంకేతిక ఆధారాలతో నిందితుల కదలికలను గుర్తించారు. ఏఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, జనవరి 21న కామారెడ్డి పట్టణంలోని డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకునీ విచారించగా విచారణలో వీరు నలుగురు సభ్యులుగా ఏర్పడిన ముఠాగా తేలిందని చెప్పారు.

ఈ ముఠా ప్రధానంగా రాత్రి, తెల్లవారుజామున మెయిన్ రోడ్ల పక్కన ఉన్న తాళం వేసిన షాపులను లక్ష్యంగా చేసుకుని, ముందుగా దొంగిలించిన ద్విచక్ర వాహనాలతో రెక్కీ నిర్వహించేది. ఒకరు కాపలా ఉండగా, మిగతావారు మాస్కులు, గ్లౌజులు ధరించి ఇనుప రాడ్లతో షట్టర్లు లేపి, నగదు మాత్రమే దొంగిలించి వేగంగా పరారయ్యేవారని పేర్కొన్నారు. మొదటి నిందితుడు సోను పిరాజీ పవార్, రెండవ నిందితుడు అనికేత్ జాదవ్  ఇద్దరు జువైనైల్ నిందితులు (16, 17 సంవత్సరాలు) – వీరంతా మహారాష్ట్రకు చెందినవారు.

ప్రస్తుతం A1, A2 పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిపై నాలుగు కేసులు నమోదు కాగా, జువైనైల్ నిందితుడిపై గతంలో మెట్‌పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. వీరి నుండి రెండు ద్విచక్ర వాహనాలు, ఇనుప రాడ్లు, మాస్కులు, గ్లౌజులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు.

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నేర నియంత్రణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ చూపిన పట్టణ ఇన్స్పెక్టర్ నరహరి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు, సిబ్బందిని అభినందించినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -