నవతెలంగాణ – పెద్దవంగర
ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పెరగూడెం గ్రామానికి చెందిన గద్దల కొమురయ్య-బుచ్చమ్మ దంపతుల మనువడు గద్దల బన్నీ (17) నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గతంలోనే బన్నీ తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందారు. ఇటీవల ఉప్పెరగూడెం వచ్చిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించి ఎస్సై క్రాంతి కిరణ్ ను వివరణ కోరగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఆస్పత్రి తరలించామని, ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపడుతామని తెలిపారు.
ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES