- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని వేల్పూర్ సంక్షేమ గురుకుల బాలుర కళాశాలకు చెందిన ఒక విద్యార్థి హాస్టల్ ప్రాంగణంలో శనివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజాంసాగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన గడ్డం సంతోష్ బైపీసీ ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం వ్యాయామం పూర్తి చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిగ్రీ కళాశాల వెనుక గల నర్సరీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నాడు. విద్యార్థి సంఘ నాయకులు అధ్యాపకులను సంప్రదిస్తే తమ విద్యార్థి కాదని బుఖాయించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -