నవతెలంగాణ – వనపర్తి
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులపై పట్టు సాధించాలని, వారికి అర్థమయ్యే విధంగానే విద్యా బోధన ఉండాలని అటు అధ్యాపకులకు, ఎటు విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రం మర్రికుంటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థులకు పాఠ్యంశాలు సులువుగా నేర్చుకునేందుకు ఏర్పాటు చేసిన ఏఐ క్లాసెస్ ను పరిశీలించారు. విద్యార్థులకు వేర్వేరు లాగిన్ సౌకర్యం ఇవ్వాలని, కంప్యూటర్లు, ఇంటర్నెట్ సహా అన్ని రకాల సౌకర్యాలు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. అనంతరం కలెక్టర్ ఇంటర్ విద్యార్థుల వీక్లీ పరీక్షల మార్కుల పట్టికను తెప్పించుకుని పరిశీలన చేశారు.
విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయాల్లో బాగా వెనకబడి ఉన్నారని గుర్తించిన కలెక్టర్ అందుకు గల కారణాలపై ఆరా తీశారు. విద్యార్థులు సులభ పద్ధతిలో ఫిజిక్స్ కెమిస్ట్రీ నేర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థులు ఆయా విషయాల్లో మంచి ఫలితాలు సాధించేలా బోధన జరగాలని, మార్కులపై పర్యవేక్షించాలని సూచించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఒకసారి ఐఐటి హైదరాబాద్ టూర్ తీసుకువెళ్లాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను కలిసిన కలెక్టర్ వారికి ఫిజిక్స్ లోని పలు అంశాలపై వారి సామర్థ్యాలను తెలుసుకునేందుకు ప్రశ్నలను అడిగారు. అనంతరం చురుగ్గా సమాధానాలు చెప్పిన విద్యార్థులకు నోటు పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. బట్టి పట్టే విధానంలో కాకుండా ఫార్ములా ఆధారంగా విద్యార్థులు చదువు నేర్చుకునేలా ప్రోత్సహించాలని ఆధ్యాపకులకు సూచించారు. ప్రిన్సిపల్ సరస్వతి, అధ్యాపకులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES