వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు సంజీవ్ మేగోటి రూపొందిస్తున్న చిత్రం ‘పోలీస్ కంఫ్లైంట్’. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఎంఎస్‌కె ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాలకృష్ణ మహరాణా నిర్మిస్తుండగా, ‘అఘోర, ఆప్త, పౌరుషం, రాఘవ రెడ్డి, ఆదిపర్వం’ వంటి విభిన్న చిత్రాలను రూపొందించిన దర్శకుడు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ,’ఈ సినిమాలో వరలక్ష్మి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. తొలిసారి పూర్తిగా వినోదాత్మకమైన రోల్‌లో నటించడం ప్రత్యేక ఆకర్షణ. సూపర్ స్టార్ కృష్ణపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది’ అని తెలిపారు.
దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ,’చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నాం. మనం చేసే ప్రతి చర్య తిరిగి మనకే ఫలితంగా వస్తుందన్న భావనను హర్రర్ థ్రిల్లర్‌గా కొత్త కోణంలో చూపించనున్నాం. చిత్రయూనిట్ అందరి సపోర్ట్‌తో షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేశాం. సినిమా అవుట్ ఫుట్ బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగానే విడుదలకు సన్నాహాలు చేస్తాం’ అని తెలిపారు. రవి శంకర్, శరత్ లోహితాశ్వ, పథ్వీ (యానిమల్), శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమినీ సురేష్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్‌ఎన్ హరీష్, ఎడిటర్: అనుగోజు రేణుకా బాబు, సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సుధాకర్ మారియో, సంజీవ్ మేగోటి, ఆర్ట్ డైరెక్టర్: మురళీధర్ కొండపనేని, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, రవితేజ.
ఆసక్తికరంగా ‘పోలీస్ కంప్లైంట్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



