Wednesday, October 22, 2025
E-PAPER
Homeజాతీయంశబరిమల ఆలయంలో బంగారం వివాదం హైకోర్టుకు మధ్యంతర నివేదిక

శబరిమల ఆలయంలో బంగారం వివాదం హైకోర్టుకు మధ్యంతర నివేదిక

- Advertisement -

కొచ్చి : శబరిమల ఆలయంలో బంగారం వివాదం కేసుపై దర్యాప్తు నిర్వహిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన మధ్యంతర నివేదికను కేరళ హైకోర్టుకు మంగళవారం సమర్పించింది. ఈ కేసు విచారణను ఈ నెల ప్రారంభంలో ఎస్‌పి ఎస్‌.శశిధరణ్‌ నేతృత్వంలోని సిట్‌కు హైకోర్టు అప్పగించిన సంగతి తెలిసిందే. నివేదికను సీల్డ్‌కవర్‌లో శశిధరణ్‌ కోర్టు అందచేశారు. మంగళవారం ఈ కేసు విచారణను జస్టిస్‌ రాజా విజయరాఘవన్‌, జస్టిస్‌ కెవి జయకుమార్‌లతో కూడిన ధర్మాసనం నిర్వహించింది. ఈ విచారణ సందర్భంగా కోర్టులోకి సాధారణ ప్రజలను, మీడియాప్రతినిధులను అనుమతించలేదు. శబరిమల ఆలయంలోని బంగారు పూత పోసిన ద్వారపాలకులు రాగి విగ్రహాల బరువు 2019 నుంచి 4.5 కేజీలు తగ్గడంపై వివాదం ఏర్పడింది. దీనిపై సిట్‌ విచారణ నిర్వహిస్తుంది. ఎలక్ట్రోఫ్లేటింగ్‌ కోసం విగ్రహాలను చెన్నైకు చెందిన వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్‌ పొట్టికి పంపిన తరువాత విగ్రహాల బరువు తగ్గిన విషయాన్ని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టిడిబి) విజిలెన్స్‌ విభాగం గుర్తించింది. దీనిపై కేసు నమోదు చేయాలని, సిట్‌ను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ‘అదృశ్యమైన’ బంగారానికి సంబంధించిన రికార్డులు, ఇతర ఆధారాల కోసం ఉన్నికృష్ణన్‌ పొట్టి నివాసంలో శనివారం సోదాలు నిర్వహించింది. ఈ వివాదంలో ఉన్నికృష్ణన్‌ పొట్టి, మరో తొమ్మిది మందిని దోషులుగా సిట్‌ భావిస్తోంది. ఉన్నికృష్ణన్‌ పొట్టి 2004 నుంచి 2008 వరకూ ఆలయంలోని ఒక పూజారికి సహాయకుడిగా పనిచేశారని, ఆయనకు విగ్రహాల్లోని బంగారు పూత గురించి తెలుసునని సిట్‌ వెల్లడించింది. కాగా, ఈ విగ్రహాలను 1998లో పారిశామ్రికవేత్త విజరు మాల్యా విరాళంగా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -