నల్లమల ముద్దుబిడ్డ తేజోమయి గౌడ్
నవతెలంగాణ – హైదరాబాద్
నల్లమల ప్రాంతానికి చెందిన చలమల్ల తేజోమయి గౌడ్ బైపీసీ మొదటి సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి రెండవ ర్యాంకు సాధించింది. తేజోమయి తల్లిదండ్రులు చలమల్ల అంజలి, పాండురంగ గౌడులు నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మారడుగు అనే మారుమూల గ్రామానికి చెందినవారు. ముగ్గురు ఆడపిల్లల్లో పెద్దమ్మాయి తేజోమయి. పిల్లలను బాగా చదివించాలన్న తపనతో తండ్రి రోజువారీ కూలీగా పనిచేస్తూ పెద్దమ్మాయిని హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు కళాశాలలో బైపీసీలో చేర్పించాడు. తండ్రి శ్రమను, నమ్మకాన్ని వమ్ముకానీయకుండా పట్టుదలతో చదివిన తేజోమయి 437 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండవ ర్యాంకును సాధించింది. తేజోమయి సాధించిన విజయానికి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మారడుగు గ్రామస్తులు అభినందిస్తున్నారు.
ఇంటర్ బైపీసీ స్టేట్ సెకండ్ ర్యాంకర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



