నవతెలంగాణ – భిక్కనూర్
ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో మొదటి రోజు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎగ్జామినేషన్ సెంటర్‌ను అధికారులు సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. పరీక్షల మొదటి రోజు మొత్తం 294 మంది విద్యార్థులకు గాను 290 మంది విద్యార్థులు హాజరు కాగ 4 విద్యార్థులు గైహాజరు అయినట్లు ఎగ్జామ్ సెంటర్ ఇన్‌చార్జి శ్రీనివాస్ తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని ఎమ్మార్వో సునిత, ఎస్సై ఆంజనేయులు తనిఖీ చేసి, పరీక్షల నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కానిస్టేబుళ్లను బందోబస్తు విధులకు నియమించారు. అధికారులు పరీక్షలు సజావుగా కొనసాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



