Sunday, April 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు ఇంటర్‌ ఫలితాలు

నేడు ఇంటర్‌ ఫలితాలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల ఫలితాలు నేడు విడుదల చేయనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా సంబంధాలు) కె.కేశవరావు ఫలితాలను విడుదల చేస్తారని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
మొబైల్‌లో ఇంటర్‌ ఫలితాలు
తెలంగాణ వాట్సప్‌ మీ సేవ 580కి పైగా విభిన్న సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్మీడియట్‌ ఫలితాలను కూడా మొబైల్‌లో అందుబాటులోకి రానున్నాయి. తమ పరీక్షల ఫలితాలను నేరుగా వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీనికి పోర్టల్‌ లాగిన్‌ గానీ, సర్వీస్‌ సెంటర్‌ సందర్శన గానీ అవసరం లేదు. ఈ ప్లాట్‌ఫామ్‌ ఇంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ మరియు ఎస్‌ఎస్సి హాల్‌ టిక్కెట్లను ఉచితంగా, తక్షణమే పొందేందుకు వీలు కల్పించింది.
”8096958096 నంబర్‌ను కాంటాక్ట్స్‌లో ”మీసేవా తెలంగాణ” అని సేవ్‌ చేసుకోండి. వాట్సాప్‌ ఓపెన్‌ చేసి, మీసేవ చాట్‌బాట్‌ను ప్రారంభించడానికి HI అని పంపండి.BIE Exam Result అని టైప్‌ చేసి, ఓపెన్‌ సర్వీస్‌పై ట్యాప్‌ చేయండి. రోల్‌ నెంబర్‌ను నమోదు చేసి, సంవత్సరం (1వ / 2వ) మరియు స్ట్రీమ్‌ (జనరల్‌ / వొకేషనల్‌) ఎంచుకోండి. సబ్మిట్‌ చేయండి. మీ ఫలితం తక్షణమే వాట్సాప్‌లో పంపబడుతుంది… ” అని మీ సేవా అధికారులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -