సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇంటర్ ఫలితాల సమయం, వేదిక శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. అయితే గతంతో పోలిస్తే ఈ సారి త్వరితగతిన ఫలితాలను విడుదల చేయాలని సంకల్పించింది. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయాలనే ఉద్దేశంతో పరీక్షలు కొనసాగుతుండగానే మార్చి మొదటి వారం నుంచే జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించి వేగంగా ప్రక్రియ పూర్తి చేసింది.
గతంలో సాధారణంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఇంటర్ ఫలితాలు విడుదల చేసేవారు. ఈసారి తీసుకున్న చర్యలతో గతంలో కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా సాధ్యమైనంత త్వరగా నిర్వహించి విద్యా సంవత్సరం ప్రారంభం లోపే ఫలితాలు ప్రకటించాలని భావిస్తున్నారు. తద్వారా ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులు సకాలంలో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.
రేపు ఇంటర్ ఫలితాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



