Sunday, January 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబ్రెజిల్‌లో అంతర్జాతీయ ఫాసిస్ట్‌ వ్యతిరేక సమావేశం

బ్రెజిల్‌లో అంతర్జాతీయ ఫాసిస్ట్‌ వ్యతిరేక సమావేశం

- Advertisement -

మార్చి 26 నుంచి 29 వరకు..

బ్రసిలియా : ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌ అంతర్జాతీయంగా ఫాసిస్టు వ్యతిరేక శక్తుల్ని కూడదీసే చర్యలు చేపట్టింది. సామ్రాజ్యవాద వ్యతిరేక చర్యను బలోపేతం చేయడానికి అంతర్జాతీయ ఐక్యతను కోరడానికి బ్రెజిల్‌ ఇంటర్నేషనల్‌ యాంటీఫాసిస్టు కాన్ఫరెన్స్‌ (అంతర్జాతీయ ఫాసిస్టు వ్యతిరేక సమావేశం)ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశం మార్చి 26 నుంచి 29 వరకు బ్రెజిల్‌లోని పోర్టో అలెగ్రేలో జరగనుంది. కాగా, కార్మికుల హక్కుల్ని నాశనం చేయడం, ప్రజా సేవలు ప్రయివేటీకరించడం, వలసవాద విధానాలను కఠినతరం చేయడం, సైనిక వ్యయం పెంచడం, అక్రమ రుణాల రద్దు వంటి వాటిపై ప్రతి ఖండంలోనూ నియోఫాసిస్ట్‌ ఉద్యమాలు ముందుకు సాగుతున్నాయి. హద్దేలేని స్వార్థ ప్రయోజనాలు, వనరులను స్వాధీనం చేసుకోవడానికి, జనాభాను దోపిడీ చేయడానికి అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ చర్యలు తీవ్రతరమవుతు న్నాయి. వీటిపై చర్చించడానికి 50 దేశాల నుంచి 230 మందికిపైగా ప్రముఖులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రాజకీయ నాయకులు, సిద్ధాంతకర్తలు, కార్యకర్తలు, మేధావులు, పర్యావరణవేత్తలు, జాతి వ్యతిరేకులు, పలువురు అంతర్జాతీయవాదులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -