- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
అంతర్జాతీయ బాలోత్సవాల సందర్భంగా సాధన సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ బాలికల హైస్కూల్ కోటగల్లి అక్సెస్ టు జస్టిస్ ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. సాధన సంస్థ నగర కోఆర్డినేటర్ మధుసూదన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాల కార్మికులు లేని, బాల్యవివాహాలు లేని, బాలల అక్రమ రవాణా లేని నిజామాబాద్ జిల్లాగా రాష్ట్రంగా దేశంగా రూపుదిద్దుదామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, సాధన సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



