- Advertisement -
- – కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న న్యాయవాదులు..
- నవతెలంగాణ – వేములవాడ
- అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ కోర్టు బార్ అసోసియేషన్ హాల్లో గురువారం న్యాయవాదులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జూలై 17 అంతర్జాతీయ నేర న్యాయ వ్యవస్థను, న్యాయం కోసం పోరాడే వారిని గుర్తుచేస్తుందని, మారణహోమం, యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే తీవ్రమైన నేరాలకు బాధ్యులైన వారిని శిక్షించాల్సిన అవసరం ఉందని జూలై 17 గుర్తు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కోర్టు ఏజీపీ బొడ్డు ప్రశాంత్ కుమార్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కటకం జనార్ధన్, సీనియర్ న్యాయవాదులు నేరెళ్ల తిరుమల గౌడ్, గుడిసె సదానందం, పొత్తూరు అనిల్, కుమార్, కోళ్ల శ్రీనివాస్, విద్యాసాగర్ రావు, మాదాసు దేవయ్య, ప్రతాప సంతోష్, పిట్టల మనోహర్, నక్క దివాకర్, నడిగొట్ల హరికృష్ణ, నేదూరి అభిలాష్, భీమా మహేష్ బాబు, కనికరపు శ్రీనివాస్, గుడిపల్లి మహేష్, జనార్ధన్, మహిళ న్యాయవాదులు జక్కుల పద్మ, సరిత, అన్నపూర్ణ తదితరులున్నారు.
- Advertisement -