Friday, January 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు13నుంచి ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌

13నుంచి ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌

- Advertisement -

తెలంగాణ సంస్కృతిలో భాగమే పతంగుల పండుగ : మంత్రి జూపల్లి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ను ఈ నెల 13 నుంచి 15 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. సెలబ్రిటీ దిస్కై పేరుతో సంక్రాంతి సెలబ్రేషన్స్‌ జరుగుతాయని చెప్పారు. డ్రోన్‌ డే సందర్భంగా ఈ నెల 13, 14 తేదీల్లో డ్రోన్‌ ఫెస్టివల్‌, 16 నుంచి 18 వరకు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని వెలికితీయడంలో భాగమే పతంగుల పండుగ అని పేర్కొన్నారు. పరేడ్‌ గ్రౌండ్‌లో కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నామనీ, దీనికి 19 దేశాలకు నుంచి 40 మంది అతిథులు.. 15 రాష్ట్రాల నుంచి టూరిస్ట్‌లు రానున్నారని చెప్పారు.

టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రయివేట్‌ పెట్టబుడులను ఆకర్షించాల్సిందేనన్నారు. పర్యాటక రంగంలో నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని చెప్పారు. అందుకే ఆ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రకృతి సంపదను ప్రజలకు దగ్గరగా చేస్తున్నామని వివరించారు. ప్రకృతి అందాలను కొత్తగా సృష్టించలేమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గొప్పగొప్ప కట్టడాలను పర్యాటకులకు తెలియజేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో చాలా దేశాలు టూరిజంపై ఆధారపడ్డాయని గుర్తు చేశారు. పెట్టుబడులను ఆకర్షించి పలు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -