Saturday, November 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌ వేదికగా అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం

హైదరాబాద్‌ వేదికగా అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం

- Advertisement -

అంతర్జాతీయ లఘు చిత్రాల ప్రదర్శనకు హైదరాబాద్‌ వేదిక కానుంది. తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జరగబోయే హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌ కార్యక్రమం దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిలిం స్టడీ సంస్థ ద్వారా నిర్వహణ జరుగుతుందని సినిమాటోగ్రఫీ శాఖామంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణ కోసం టీఎఫ్‌డీసీ ద్వారా రూ30 లక్షల బడ్జెట్‌ విడుదలకు అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. మంత్రి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక జీవోని జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఓ వెబ్‌సైట్‌ను శుక్రవారం టీఎఫ్‌డీసి ఎండీ ప్రియాంకతో కలిసి టీఎఫ్‌డీసి చైర్మన్‌ దిల్‌రాజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ, ‘హైదరాబాద్‌ను గ్లోబల్‌ సినీ హబ్‌గా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలను సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా డిసెంబర్‌ 19-20-21 మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో అంతర్జాతీయ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌ని ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ల ప్రదర్శనకు ఐమాక్స్‌ థియేటర్‌ వేదిక కానుంది. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనే మేకర్స్‌ తమ లఘు చిత్రాలను 3 సెకన్ల నుంచి 25 నిమిషాల పాటు నిడివి గలవి అధికారిక వెబ్‌ సైట్‌లోనే అప్‌లోడ్‌ చేయాలి. ఈ వేడుకకు ఇంటర్నేషనల్‌ స్థాయి ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు హాజరవుతారు. వచ్చే ఏడాది నవంబర్‌ 14 నాటికి అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తాం’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -