నవతెలంగాణ – చిన్న కోడూరు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మండలంలోని రాముని పట్ల గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలో సిసి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలు, నిర్వహించారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన మహిళలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీసీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం ఆరోగ్య రక్షణ కోసం ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని అన్నారు. మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ద దానికి ప్రభుత్వము ఎంతగానో గురిచేస్తుంద న్నారు. ఈకార్యక్రమంలో రామునిపట్ల గ్రామైక్య సంఘం మహిళా సభ్యులందరూ పాల్గొన్నారు. అనంతరం గ్రామైక్య సంఘ మహిళలలను సన్మానించినట్లు తెలిపారు.



