Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – బొమ్మలరామారం : మానసిక ప్రశాంతతకు శరీరక ఉల్లాసానికి, మంచి ఆరోగ్యనికి యోగా .. దివ్య ఔషధం మాదిరిగా పనిచేస్తుందని ప్రధానోపాధ్యాయులు పగిడిపల్లి నిర్మలజ్యోతి అన్నారు. మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్యాల ఆవరణలో శనివారం ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకుని అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ… ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి అయిన యోగా , శారీరక, మానసిక శ్రేయస్సును పెంపొందించడానికి అత్యంత విశ్వసనీయ మార్గాలలో ఒకటని, ఇది మనస్సు, శరీరం యొక్క ఐక్యతను సూచిస్తుందని మనవుడు, ప్రకృతి మధ్య సామరస్యం ఆరోగ్యం శ్రేయస్సుకు సమగ్ర విధానాన్ని సూచిస్తుందని తెలియజేస్తూ యోగ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం స్వరూపారా ణి, సిద్దులు,రాజు, ముఖిత్, రవీశ్వర్, సుజాత, శ్రీధర్, నాగజ్యోతి, శోభ, శ్రీదేవి,గోపాల్, సుష్మ, మంజుల, ఇందిరా, పద్మావతి గార్ల తోపాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad