Saturday, August 2, 2025
E-PAPER
Homeజిల్లాలుకామారెడ్డిలో అంతరాష్ట్ర దొంగల అరెస్ట్..

కామారెడ్డిలో అంతరాష్ట్ర దొంగల అరెస్ట్..

- Advertisement -

– చోరీకి గురైన వస్తువులు స్వాధీనం 
– చాకచక్యంగా కేసును చేదించిన పోలీసులను అభినందించిన ఎస్పీ 
నవతెలంగాణ – కామారెడ్డి

పొద్దంతా వ్యాపారం రాత్రి అయితే దొంగతనం. ఇది ఈ అంతరాష్ట్ర దొంగల కార్యక్రమమని జిల్లా ఎస్పీ యం, రాజేష్ చంద్ర అన్నారు. ఉదయం పూట ఐస్క్రీమ్లు అమ్ముతూ ఎక్కడైతే దొంగతనానికి అనుకూలంగా ఉంటుంది, ఇక్కడ ఏ వస్తువులు ఉంటాయో గమనించి రాత్రిపూట దొంగతనాలు చేయడం వీరి ప్రవృత్తి అని ఎస్పీ అన్నారు. రాబరీ, దొంగతనాలకు పాల్పడిన అయిదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర తెలిపారు.

శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తేదీ 25.07.2025 నా భిక్నూర్ మండలం అంతంపల్లి గ్రామ శివారు లోగల రెడీమిక్స్ దగ్గర జరిగిన రాబరీకి సంబంధించి క్రైమ్ నం. 263/2025 యు/ఎస్ 310(2), 313, 324(4),317(2) బి ఎన్ ఎస్  కింద భిక్నూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిందనీ, తేదీ 27.07.2025 నా తలమడ్ల గ్రామం శివార్లో జెన్ అడ్సార్షన్  కంపెనీ ( ZEN ADSORPTIONS COMPENY ) లో దొంగతనానికి సంబందించిన క్రైమ్ నం 112/2025 331(4), 305(ఆ) బి ఎన్ ఎస్ భిక్నూర్ పోలీస్ స్టేషన్ లో నమోదయింది. తదుపరి విచారణను పురోగమింపజేసిన భిక్నూర్ పోలీసు అధికారులు బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాలని పరిశీలించి పలు మూలధన ఆధారాలను సేకరించారు. 

గత నెల 25న గుర్తు తెలియని నిందితులు రీమిక్స్ కంపెనీలకు చొరబడి ఇద్దరు వాచ్మెన్ బెదిరించి ఒక వ్యక్తి నుంచి సెల్ ఫోన్ కంపెనీలోనే ఐరన్ రాడ్స్ 11వేల విలువగల వస్తువులను అపరించగా  బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. గత నెల 27న రాత్రి గుర్తుతెలియని నిందితుడు జెన్ అడ్సార్షన్   కంపెనీలోకి చొరబడి 15 లక్షల విలువైన వస్తువులను అపరించినట్లు ఆ కంపెనీ బాధితుడు ఫిర్యాదు చేయక దానిని నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో తన దృష్టికి రాగా తాను కామారెడ్డి ఏ ఎస్ పి, బి, చైతన్యారెడ్డి  పర్యవేక్షణలో భిక్నూర్ సీఐ,  సిసిఎస్ ఇన్స్పెక్టర్, భిక్నూర్ ఎస్‌ఐ లు సిబ్బంది తో ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగించగా, కేసుకు సంబంధించి భిక్నూర్  టోల్గేట్ వద్ద ఒకరిని,  కామారెడ్డిలో నలుగురుని  హైదరాబాద్లో వస్తువులను కొనుగోలు చేసిన ఒకరిని మొత్తం ఆరుగురుని అనుమానితులుగా నిందితులను అదుపులోకి తీసుకొని, వారు ఇచ్చిన నేరం ఒప్పుకోలు ఆధారంగా, దొంగిలించి హైదరాబాద్లో దాచి ఉంచిన మొత్తం సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ 

 వ్యక్తులు పై రెండు కేసులతో పాటు కొన్ని రోజుల క్రితం మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిదిలో దొంగతనాల కి పాల్పడిన ఇంకా 4 నేరాలకు సంబంధించిన వాటిని కూడా ఒప్పుకున్నారన్నారు.  అట్టి కేసులకి సంబంధించిన పూర్తి దొంగతనం సొత్తును  స్వాధీన చేసుకోవడం జరిగిందన్నారు. మొదటి నిందితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లా, ముసలాపూర్ గ్రామానికి చెందిన తానే అలీ అనే వ్యక్తి ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ లో నివాసం ఉంటున్నాడు, ఇతను ఐస్ క్రీమ్ తయారు చేసి అమ్ముకునే వ్యక్తిని అన్నారు. రెండవ నిందితుడు కూడా మొదటి నిందితుడిని రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు చెందిన వాడేనని, కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ లో నివాసము ఉంటూ ఐస్ క్రీమ్ తయారుచేసి విక్రయిస్తుంటాడు అన్నారు.

మూడవ నిందితుడు  సల్మాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాగా అతను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ లో నివాసముంటు ఐస్క్రీమ్ తయారు చేసే విక్రయించుకునే వాడని అన్నారు. నాలుగవ నిందితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటూ ఐస్ క్రీమ్ ను తయారు చేసి విక్రయించేవాడు, నలుగురితో పాటు ఒక మైనర్ బాలుడైన చాంద్ బాబు ఈ బాలుడు ఆదర్శనగర్ లో ఉంటూ బైక్ మెకానిక్ గా పని చేస్తున్నాడని వీరందరిదీ ఒకే రాష్ట్రమని అన్నారు. ఆరవ నిందితుడైన హాసన్ ఖాన్ హైదరాబాద్ ముషీరాబాద్ కు చెందిన ఇతను వీరు దొంగతనం చేసి తీసుకోవాల్సిన వస్తువులు కొనుగోలు చేసి వీరికి డబ్బులు ఇచ్చేవాడని వీరందరూ నీకు అసలు ఎక్కి తీసుకొని ఇంకా పూర్తి సమాచారం కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. దొంగతనం చేయటానికి ఉపయోగించిన ఆటో, ఫోన్ ల వివరాలు , హీరో గ్లామర్ బైక్, వివో వి 20 మొబైల్ ఫోన్,

ఐరన్ రాడ్, పోకో బ్లూ కలర్ ఫోన్, వివో మొబైల్ లావా కీప్యాడ్, మొబైల్, ఒక టాటా ఏసీ వెహికల్ సాంసంగ్ ఎస్ 23 మొబైల్ వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కేసును ఛేదించిన విచారణాధికారి భిక్నూర్ సీఐ ఎం. సంపత్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎన్. శ్రీనివాస్, కామారెడ్డి రూరల్ సిఐ ఎస్. రామన్, భిక్నూర్ ఎస్ఐ.ఆంజనేయులు, సి సి ఎస్ ఎస్‌ఐ ఎండి. ఉస్మాన్, మాచారెడ్డి ఎస్‌ఐ ఎస్. అనిల్,  సిబ్బంది, ఏ ఎస్ ఐ  వెంకట్రావ్, ఐటీ కోర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ కిషన్, రాజావీరు, సిసిఎస్ కానిస్టేబుల్  గణపతి, మైసయ్య, స్వామి, రాజేంద్రకుమార్, రవి, భిక్నూర్ సిబ్బంది రజనీకాంత్, రాములు, కిషన్ గౌడ్, గడ్డం నరేష్, రాజేంద్రప్రసాద్, సంజీవ్ కుమార్, తిరుమల లక్ష్మీకాంత్, మేకల నరేష్, లను మరియు వారి బృందాన్ని  జిల్లా పోలీస్ అధికారులు అభినందించారు. ఎవైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -