Wednesday, October 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశ్రీగంధం చెట్ల అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు 

శ్రీగంధం చెట్ల అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు 

- Advertisement -

11 మొద్దులు, మూడు సెల్ఫోన్లు, రెండు బైక్లు, పరికరాలు స్వాధీనం 
వివరాలు వెల్లడించిన డీఎస్పీ కె శివరాంరెడ్డి 
నవతెలంగాణ – నల్లగొండ టౌన్  

తోటల్లో రైతులు పెంచుతున్న శ్రీగంధం చెట్లను నరికి దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను ఆరెస్టు చేసి వారి నుండి చెట్ల కొట్టేందుకు వాడే పరికరాలు, మూడు సెల్పోన్లు, రెండు బైక్లు, 11 శ్రీగంధం మొద్దులను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల రెండు నెలలుగా నల్లగొండ చుట్టుపక్కల ప్రాంతాల్లోని తోటల్లో – శ్రీగంధం చెట్టు కొట్టి షాగబోసిన చెట్లను తీసుకెళ్తు, షాగపోయని చెట్లను వదిలి వస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. అందులోభాగంగా బుధవారం ఉదయం నల్లగొండ- దేవరకొండ రహదారిపై కనగల్ సమీపంలో రెండు బైక్ల పై ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా వెళ్తు వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి వెనక్కి వెళ్తుండగా వారిని పట్టుకుని తనిఖీలు చేసినట్లు తెలిపారు.

వారి వద్ద చెట్లు నరికే పరికాలను గుర్తించినట్లు తెలిపారు. వారిని ఆదుపులోకి తీసుకుని విచారణ చేయగా వారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దివానా, దద్ద సింగ్, మజాన్లుగా గుర్తించామన్నారు. వీరు వివిధ ప్రాంతాల్లో కుటుంబాలతో గుడారాలు ఏర్పాటు చేసుకుని సంచార జీవనం చేస్తూ రుద్రాక్షలు, పూసలు అమ్ముకుని జీవిస్తుండేవారన్నారు. గంధపు చెట్ల వ్యాపారం చేసే మహారాష్ట్రకు చెందిన అన్నాబహు లక్ష్మణ్ గైక్వాడ్ అనే వ్యక్తి వచ్చి మీరు ఇలా వ్యాపారం చేయడం వల్ల ధనవంతులు కాలేరని తనకు శ్రీగంధం చెట్ల మొద్దులు ఇస్తే తొందరగా ధనవంతులుగా మారుతారని ఆశపెట్టినట్లు తెలిపారు. దీంతో వీరు తెలంగాణ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో ఉదయం కుటుంబాలతో కలిసి రుద్రాక్షలు, పూసలు అమ్ముతూ శ్రీగంధం చెట్లకు రెక్కి నిర్వహించేవారని తెలిపారు. ఇలా తోటల్లో రైతులు సాగుచేస్తున్న శ్రీగంధం చెట్లను గుర్తించి రాత్రి వేళ్లలో వాటిని నరికి మొద్దులుగా మార్చి ఆన్నా బహుకు అప్పగించేవారని తెలిపారు.

వీరు రెండు నెలలుగా కనగల్ మండలంలోని తెలకంటిగూడెం, తిమ్మన్నగూడెం, నార్కట్పల్లి, గుర్రంపోడ్, నల్గొండ రూరల్, చండూర్ మండలాల్లో ఆరు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఇప్పటివరకు వీరు 168 చెట్లు నరికి షాగ పోయని చెట్లను వదిలి, షాగ పోసిన చెట్లు 40 కేజీలను అప్పగించగా వారికి పదివేయిల చోప్పున ఐదుగురికి అప్పగించినట్లు తెలిపారు. చెట్లను స్మగ్లింగ్ చేసే వ్యక్తితోపాటు మరో ఇద్దరు పఠారిలో ఉన్నారని తెలిపారు. ఈసమావేశంలో సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐ లు సైదాబాబు, వెంకన్న, రాజీవ్ రెడ్డి, సిబ్బంది రమేష్, జానకిరాములు, తిరుమల్లేష్, శ్రీకాంత్రరాజు, బాలకోటి, శంకర్, శేఖర్, సురేష్ వెంకట్రెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -