Tuesday, May 6, 2025
Homeఖమ్మంఅంతరాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

అంతరాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట: వ్యసనాలకు బానిసైన ఒక ఆటో డ్రైవర్ తెలుగు రాష్ట్రాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ ఆశ్వారావుపేట పోలీసులకు చిక్కాడు. స్థానిక పోలీస్ స్టేషన్ లో సోమవారం పాల్వంచ డీఎస్సీ సతీష్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్ల గట్టు గూడెంకు చెందిన ముత్యాల గణేష్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. వ్యసనాలకు బానిసై, ఈజీ మనీ కోసం ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నాడు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో రద్దీ ప్రదేశాలను టార్గెట్ చేసుకుని వాహనాలను చోరీ చేస్తున్నాడు. నెంబర్ ప్లేట్లు మార్చి వాహనాలను విక్రయిస్తున్నాడు. ఈ దశలో సోమవారం స్థానిక పెట్రోల్ బంక్ వద్ద శిక్షణ ఎస్ఐ అఖిల సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముత్యాలు చోరీ చేసిన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా పట్టుకున్నారు. ముత్యాలును అదుపులోకి తీసుకున్న పోలీస్  లోతుగా విచారించగా.. ఇప్పటికే 10 ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించాడు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 3, దమ్మపేట పరిధిలో 1, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తడికలపుడి పోలీస్ స్టేషన్ పరిధిలో 6 ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం చోరీ చేసిన వాహనాలను రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హజరు పరిచినట్లు వివరించారు. అంతరాష్ట్ర వాహన దొంగను పట్టుకున్న శిక్షణ ఎస్సై అఖిల తో పాటు సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.  సమావేశంలో సిఐ నాగరాజు, ఎస్సైలు యయాతి రాజు,క్రైం విభాగం హెడ్ కానిస్టేబుల్ నాగేంద్రరావు, కానిస్టేబుల్ ఎన్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -