Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఇంటర్వ్యూలు పూర్తి

గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఇంటర్వ్యూలు పూర్తి

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మ్యాథమెటిక్స్,ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఈసీఈ, ఇఇఇ,మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టులు బోధించుటకు గెస్ట్ ఫ్యాకల్టీ  నియామకం కొరకు గురువారం  11 గంటలనుండి  పరిపాలనా భవనంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు దాదాపుగా వందమంది  హాజరయ్యారు.

 వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు అధ్యక్షతన అత్యంత పారదర్శకంగా  జరిగిన ఇంటర్వ్యూలలో విషయ నిపుణులను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆరతి  సమన్వయం చేశారు. వివిధ విభాగాల కో ఆర్డినేటర్సు  ప్రొఫెసర్ నందిని, ప్రొఫెసర్ అతీక్ సుల్తాన్ గోరి, ప్రొఫెసర్ బ్రమరాంబిక, ప్రొఫెసర్ నీలిమాలు సాంకేతిక సహాయాన్ని అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -