– అలైదా గువేరా
1959 జనవరి 1న క్యూబాలో విప్లవం జయప్రదమైంది. తొలి విప్లవ ప్రభుత్వంలో మంత్రిగా చే గువేరా పనిచేశారు. ఆయన కుమార్తె ఆలైదా గువేరా… తండ్రి మాదిరిగానే వైద్య వృత్తిలోకి ప్రవేశించారు. ఆమె .. క్యూబాలో పేరొందిన వైద్యురాలు. ఆ దేశ రాజధాని హవానాలోని విలియం సోలర్ చిల్డ్రన్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అంగోలా, ఈకెవ్డఆర్, నికరాగువా దేశాల్లోనూ వైద్యసేవలందిస్తున్నారు. అలైదా తను ఎక్కువగా అంగోలాలోని క్యూబన్ మెడికల్ మిషన్‌లో పనిచేసేవారు.
ఒక సందర్భంలో ఆమె ఇలా అన్నారు : ‘అక్కడ నేను చాలామంది చిన్నారుల ప్రాణాలను రక్షించాను. కొన్నిసార్లు అందులో విజయం సాధించలేకపోయాను. నేను ఎప్పటికీ దు:ఖం, విచారంతో ఉన్న వారితోనే ఉంటాను.” ఆమె 2009 నుండి క్యూబాలో వికలాంగులైన చిన్నారుల సహాయం కోసం రెండు గృహాలను నిర్వహిస్తున్నారు. దేశీయ సమస్యలతో బాధపడుతున్న శరణార్థ పిల్లల సహాయం కోసం మరో రెండు గృహాలను నడుపుతున్నారు. అలైదా పిల్లల అలర్జీ సమస్యలకు సంబంధించి ప్రత్యేక వైద్య నిపుణురాలిగా పేరొందారు.
తండ్రి స్ఫూర్తితో వైద్య సేవలోకి …
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



