Saturday, October 11, 2025
E-PAPER
Homeకవితనిశ్శబ్దంలోకి…!

నిశ్శబ్దంలోకి…!

- Advertisement -

అడుగు ముందుకో వెనక్కో అర్థం అయ్యేంత వరకు
మనం కాసింత సేపు నిశ్శబ్దంలోకి ప్రవహిద్దాం!
పరిణామాల్ని జీర్ణించుకోలేకపోతే
ప్రయాణాలు ఆగిపోతాయి
ఉత్తాన పతనాలు ఎప్పటికీ మనల్ని చైతన్య శీలుల్ని చేసేవే!
అనివార్యమైనప్పుడు ఊపిరి కూడదీసుకోవాలి
అద్దం ముందు నిలబడి లోపలి దశ్యాలను పసిగట్టాలి!
ఒక్కో తరానికి ఒక్కో అనుభవం మిగిలిపోతుంది
చరిత్ర మలుపులో మన పాత్ర ఉంది
మన ఆనవాళ్లే మరో తరానికి పాఠం!
వరుస కరువుల కాలాన్ని జయించిన వారసత్వం మనది
ఒకప్పుడు వానంటే ఒక కల, ఇప్పుడు నిత్య జల కళ!
ఈ జీవన పోరాటాలు ఒక నాటితో ముగిసేవి కావు
మన నిత్య సన్నద్ధతే ప్రగతి శీల చైతన్యహొసంకేతం!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -