– కళాశాల గదిలోనే ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగికదాడి
– 18 నెలలుగా వేధింపులు..
– నగ ఫొటోలు బయటపెడతానని బెదిరింపులు
– పోలీసులకు బాధితురాలి ఫిర్యాదుొనిందితుడికి రిమాండ్
నవతెలంగాణ-నిజాంపేట్
మత్తుమందు కలిపిన చాక్లెట్లు తినిపించి ఇంజినీరింగ్ విద్యార్థినిపై తోటి విద్యార్థి 18 నెలలుగా లైంగికదాడి చేసిన దారుణ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో వెలుగుచూసింది. సహకరించకపోతే నగ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరింపులకు దిగిన నిందితుడిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాచుపల్లి ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లిలోని విఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో బీటెక్ విద్యార్థినిపై అదే కళాశాలలో విద్యనభ్యసిస్తున్న ఆశిష్ తనరు 2024 నుంచి ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. ఆమెకు మత్తుమందు కలిపిన చాక్లెట్లు ఇచ్చి.. ఆ తర్వాత నగంగా ఫోటోలు తీసి తన వద్ద భద్రపరుచుకున్నాడు. అదే సమయంలో ఆమెపై లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత తరచూ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తూ యువతిని శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. 2024లో కళాశాలలోనే తరగతి అయిపోయిన తర్వాత ఎవరూ లేని సమయంలో యువతిపై లైంగికదాడి చేశాడు. అప్పుడు వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల సెక్యూరిటీ గార్డులు వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని యాజమాన్యానికి అప్పగించారు.
నిందితుడు కళాశాల యాజమాన్యాన్ని కూడా బురిడీ కొట్టించి మేనేజ్ చేసినట్టు యువతి తన ఫిర్యాదులో తెలిపింది. అనంతరం 2026 ఫిబ్రవరిలో నిందితుడు తన మిత్రుడైన ప్రవీణ్‌తో కూడా చనువుగా ఉండాలంటూ ప్రతిపాదించడంతో ఆమె వారి నుంచి తప్పించుకొని పారిపోయి తన గదిలో ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు సమాచారం. అనంతరం బాధితురాలి తల్లి కుమార్తెకు ధైర్యం చెప్పి వివరాలు తెలుసుకుని గత శనివారం బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు పూర్తి వివరాలను సేకరించి, బాధితురాలి వాంగ్మూలం రికార్డ్ చేశారు. ఆశిష్ తనరుపై, అతని మిత్రుడు ప్రవీణ్‌పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిందితుడు ఆశిష్ తనరును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మత్తు చాక్లెట్లు తినిపించి దారుణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



