Monday, February 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ ఎస్టేట్‌లోకి చొరబాటు..

ట్రంప్‌ ఎస్టేట్‌లోకి చొరబాటు..

- Advertisement -

దుండగుడి కాల్చివేత
ఫ్లోరిడా : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నివాసంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో ఉన్న ఆయన నివాసంలోకి ఓ సాయుధ దుండగుడు చొరబడటం కలకలం రేపింది. దీంతో వెంటనే స్పందించిన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అతడిని హతమార్చారు. ఈ ఘటన సమయంలో ట్రంప్‌ దంపతులు వైట్‌హౌస్‌లోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఫ్లోరిడా పామ్‌ బీచ్‌లో ఉన్న ‘మార్‌ ఎ లాగో’ ఎస్టేట్‌కు అధ్యక్షుడు ట్రంప్‌ వారాంతంలో వస్తుంటారు. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.

శనివారం అర్ధరాత్రి సమయంలో ఓ దుండగుడు ఎస్టేట్‌ నార్త్‌ గేట్‌ నుంచి ప్రవేశించాడు. అతడి చేతిలో ఆయుధంతోపాటు ఇంధనం క్యాన్‌ ఉన్నట్టు సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై మట్టుబెట్టినట్టు సీఐఏతోపాటు పామ్‌ బీచ్‌ పోలీసులు వెల్లడించారు. అతడి వయసు 20 నుంచి 25 మధ్య ఉండవచ్చని.. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హత్యకు గతంలోనూ ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. 2024 జులైలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఆ ఘటనలో మరణం నుంచి తృటిలో తప్పించుకున్నారు. అనంతరం కొన్ని నెలలకు.. పామ్‌ బీచ్‌ గోల్ఫ్‌ కోర్సులో రైఫిల్‌తో అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తినీ పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -