హైదరాబాద్ : నగరంలోని ప్రముఖ గడియారాల విక్రయ సంస్థ రమేశ్ వాచ్ కంపెనీ ప్రతిష్టాత్మక బ్రిటిష్ బ్రాండ్ బ్రిటైమ్ లండన్ వాచీలను అందుబాటులోకి తెచ్చింది. శనివారం వీటిని ఆ సంస్థ జూబ్లీ హిల్స్ స్టోర్‌లో ఆవిష్కరించింది. 1948 నుండి ఈ రంగంలో ఉన్న తమ సంస్థతో భాగస్వామ్యం ద్వారా ఈ లండన్ బ్రాండ్ తెలంగాణ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించినట్లయ్యిందని రమేశ్ వాచ్ కంపెనీ ఎండీ రోహిత్ చుగాని తెలిపారు. నాణ్యత, దీర్ఘకాలిక విలువనిచ్చే బ్రాండ్‌లను అందించడమే తమ లక్ష్యమని, బ్రిటైమ్ 2026 కలెక్షన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి టైమ్ గ్రూప్ వ్యవస్థాపకుడు హిరెన్ మోర్బియా, మిస్ ఆటి పాల్గొన్నారు.



