నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గణపతి దేవాలయంలో ఆనంద్ ప్రింటింగ్ ప్రెస్ వారు ఉచితంగా తయారుచేసిన నూతన క్యాలెండర్ లు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంతులు మాట్లాడుతూ.. గత పది సంవత్సరముల నుండి రాస ఆనంద్ దాదాపుగా 500 క్యాలెండర్లను ఉచితంగా దేవాలయం నందు భక్తులకు అందజేస్తున్నారని తెలిపారు. స్వామివారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆశీర్వదించారు. డివిజన్లోని అత్యున్నతమైన ఆనంద్ ప్రింటర్స్ గణపతి దేవాలయముకు సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలకు ఫ్లెక్సీలు ఉచితంగా అందజేస్తారని తెలిపారు. దేవాలయానికి వచ్చిన భక్తులందరికీ క్యాలెండర్ లను అందించారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్, గొల్ల దాస్, సంజీవ్, నంద, రాజేందర్, మొదలైన భక్తబృందం తదితరులు పాల్గొన్నారు.
నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



