హైదరాబాద్‌లో అనేక అవకాశాలు : సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ అవకాశాలకు అనుకూలంగా ఉందనీ, అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఇండియాలో అమెరికా రాయబారి సెర్జియో గోర్ ఇచ్చిన విందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ వ్యాపార దిగ్గజాలతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ప్రగతిశీల పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నదనీ, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కలిగి, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు. టెక్నాలజీ, ఏఐ, లాజిస్టిక్స్, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ వంటి ఎమర్జింగ్ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఫెడ్‌ఎక్స్ సీఈవో రాజ్ సుబ్రమణియన్, క్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్ ప్లెంకోవిక్, భూటాన్ ప్రధాని త్షెరింగ్ టొబ్గె తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడులు పెట్టండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



