– అసలైన కారణాలను కనుక్కోండి : గుల్జార్ హౌజ్ దుర్ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
– కుటుంబ సభ్యులకు సానుభూతి
– మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లోని గుల్జార్ హౌజ్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల అసలైన కారణాలను తెలుసుకునేందుకు వీలుగా లోతుగా దర్యాప్తు చేయాలని ఆయన ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు. ఇలాంటి విషయాల్లో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. మంటల్లో చిక్కుకున్న వారిలో 17 మంది మృతి చెందడం పట్ల సీఎం తీవ్ర విచారాన్ని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. మతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీనిచ్చారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడారని సీఎంవో ఈ సందర్భంగా తెలిపింది. తద్వారా సహాయక చర్యలను పర్యవేక్షించారని పేర్కొంది. వాటిని వేగవంతం చేయటంతోపాటు బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు వీలుగా అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. అక్కడున్న బాధిత కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి నేరుగా ఫోన్‌లో మాట్లాడారని వివరించింది.
లోతుగా దర్యాప్తు చేయండి

- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES