Monday, February 16, 2026
E-PAPER
Homeజాతీయంమేఘాలయా బొగ్గు గని పేలుడు కేసులో దర్యాప్తు

మేఘాలయా బొగ్గు గని పేలుడు కేసులో దర్యాప్తు

- Advertisement -

కమిటీ చీఫ్‌గా రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి
షిల్లాంగ్‌ : మేఘాలయ అక్రమ బొగ్గుగని పేలుడు ఘటనపై ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటీకి రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీ కేంద్ర మైనింగ్‌ చట్టాలకు జవాబుదారీతనాన్ని , రాజ్యాంగపరమైన మినహాయింపులను నిర్ణయించనున్నట్లు మేఘాలయ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. 1952 కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ యాక్ట్‌ కింద నియమించిన ఈ కమిటీలో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి హెచ్‌. నాంగ్‌ప్లుహ్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి పి.ఎస్‌.దఖర్‌ సభ్యులుగా ఉన్నారని తెలిపింది. జస్టిస్‌ చౌహాన్‌ ఉత్తరాఖండ్‌ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ప్రధాన జడ్జిగా పనిచేశారు.

మైన్సెన్‌గట్‌ గ్రామం లోని మారుమూల థాంగ్స్క్‌ ప్రాంతంలోని అక్రమ గనిలో జరిగిన పేలుడుపై కమిషన్‌ సమగ్ర దర్యాప్తు చేపట్టనుంది. నోటిఫికేషన్‌ తేదీ నుంచి ఆరు నెలల వ్యవధిలో నివేదికను, సిఫారసులను సమర్పించాలని ఉత్తర్వు పేర్కొంది. మేఘాలయలోని తూర్పు జయంతి యా జిల్లాలో పిబ్రవరి 5న జరిగిన అక్రమ బొగ్గుగని పేలుడులో 31మంది మరణించిన సంఖ్య సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్రాడ్‌ సంగ్మా ఫిబ్రవరి 9న పేలుడుపై న్యాయ విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. తూర్పు జయంతియా హిల్స్‌ ఎస్‌పి వికాష్‌ కుమార్‌ను బదిలీ చేసి, ఆయనను యాంటీ-నార్కోటిక్స్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఎన్‌టిఎఫ్‌) అధ్యక్షుడిగా నియమించినట్లు మరో నోటిఫికేషన్‌ తెలిపింది. ఎన్‌టిఎఫ్‌ చీఫ్‌ పికె రసగానియా తూర్పు జయంతియా హిల్స్‌ కొత్త ఎస్‌పిగా ఉండనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -