బీసీ కమిషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మార్చి నెల నాలుగో వారంలో విద్యుత్ సంస్థల కార్యాలయాలను సందర్శించి విచారణ నిర్వహించాలని బీసీ కమిషన్ నిర్ణయించింది. శనివారం హైదరాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయంలో ఆ కమిషన్ చైర్మెన్ జి. నిరంజన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యుత్ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ సంస్థల నియామకాల్లో రిజర్వేషన్ల ఉల్లంఘన జరుగుతుందని తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం కమిషన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ బాల మాయదేవి, డిప్యూటి డైరెక్టర్ యు.శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి కె.మనోహర్ రావు, సెక్షన్ ఆఫీసర్ జి.సతీష్ కుమార్ హాజరయ్యారు.
మార్చిలో విద్యుత్ సంస్థల కార్యాలయాల్లో విచారణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



