Saturday, September 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరూ.15వేల కోట్ల పెట్టుబడులు.. 50వేల ఉద్యోగాలు

రూ.15వేల కోట్ల పెట్టుబడులు.. 50వేల ఉద్యోగాలు

- Advertisement -

– పర్యాటక రంగంపై సర్కార్‌ ఫోకస్‌
– టూరిస్ట్‌ స్పాట్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
– చారిత్రక, ఆధ్యాత్మిక, పురావస్తు ప్రాంతాల గుర్తింపు
– కృష్ణ గోదావరి పరివాహ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
– నేడు శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్‌
– హాజరుకానున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రానున్న మూడేండ్లలో రాష్ట్రంలో15 వేల కోట్ల పెట్టు బడులు… 50 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పర్యాటక రంగాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. వనరులు, చారిత్రక వారసత్వ సంపద అంతగా లేని ప్రపంచంలోని అనేక దేశాలు టూరిజంపై వచ్చే ఆదాయంతోనే మనుగడ సాథిస్తున్నాయి. అన్ని ఉన్న తెలంగాణ ఈ రంగాన్ని ఆదాయ మార్గంగా మార్చుకోవాలనే లక్ష్యంతో చారిత్రక, ఆధ్యాత్మిక, పురావస్తు, కష్ణ గోదావరి పరివాహ ప్రాంతాలతో పాటు ఏకో మొదలగు అన్ని రకాల పర్యాటకంపై దృష్టి పెట్టింది. తెలంగాణ సందర్శన కోసం వచ్చే పర్యాటకులకు సకల వసతులు కల్పించి వారికి మరిచిపోలేని మధురానుభూతి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అనేక నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌ శిల్పారామం వేదికగా శనివారం నిర్వహించే తెలంగాణ టూరిజం కాంక్లేవ్‌-2025లో వాటిని రాష్ట్ర ప్రజలకు ఆవిష్కరించనుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కాంక్లేవ్‌లో టూరిజం అభివృద్ధికి చేపట్టనున్న పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.


పర్యాటక రంగాన్ని కేవలం ఆహ్లాదానికే పరిమితం చేయకుండా దాని నుంచి పెట్టుబడులు ఆకర్షించడం… పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానం ద్వారా పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. టూరిజం పాలసీని అధ్యయనం చేసిన పలువురు పెట్టుబడిదారులు రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన హౌటళ్లు, వెల్‌నెస్‌ సెంటర్లు, హాస్పిటాలిటీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. అనంతగిరి కొండల్లో జెసోమ్‌ అండ్‌ జెన్‌ మేఘా సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అత్యాధునిక వెల్‌నెస్‌ సెంటర్‌, ద్రాక్ష పంట నుంచి వైన్‌ తయారీ యూనిట్‌, అటవీ ప్రాంతంలో తాజ్‌ సఫారీ, మహేంద్ర కంపెనీ ఆధ్వర్యంలో వాటర్‌ఫ్రంట్‌ రిసార్ట్స్‌, ఫైవ్‌ స్టార్‌ హౌటళ్లు, తెలంగాణలోని టైర్‌ 2 నగరాల్లో జింజర్‌ హౌటళ్లు, నాగార్జున సాగర్‌లో వెల్‌నెస్‌ రిట్రీట్‌.. వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ సెంటర్‌, బుద్ధవనాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు తైవాన్‌కు చెందిన ఫాగుంగ్‌ షాన్‌ సంస్థ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి సమక్షంలో నేడు ఆయా సంస్థలు పనులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఫలితంగా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రావడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 50 వేల మందికి ఉపాధి లభించనుంది.


అంతర్జాతీయ చిత్ర నగరిగా
జాతీయ స్థాయిలో చిత్రాల నిర్మాణ కేంద్రంగా ఇప్పటికే హైదరాబాద్‌కు మంచి పేరుంది. దాన్ని మరింతగా అభి వృద్ధి చేసి ప్రపంచ చిత్ర పరిశ్రమ తమ చిత్రాలను హైదరా బాద్‌లోనే నిర్మించేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిం చింది. ఇందులో భాగంగా శనివారం జరిగే కాంక్లేవ్‌లో ఫిల్మ్‌ ఇన్‌ తెలంగాణ పోర్టల్‌ను సర్కార్‌ ప్రారంభించనుంది. ఈ పోర్టల్‌ ద్వారా సినిమా నిర్మాణాలకు సంబంధించి సింగిల్‌ విండో అనుమతులు ఇవ్వడంతో పాటు ఏఐ ద్వారా వివిధ లోకేషన్లలో షూటింగ్‌లకు తక్షణ అనుమతి లభించనుంది. మెడికో టూరిజానికి మరింత ఊతం ఇచ్చేందుకు తెలం గాణ మెడికల్‌వాల్యూ టూరిజం(ఎంవీటీ) పోర్టల్‌ను ప్రారం భించనుంది. ఈ పోర్టల్‌లో హైదరాబాద్‌లో ఏ ఏ ఆస్పత్రు లున్నాయి… ప్రముఖ వైద్యులెవరు.. వారు ఏరకమైన సేవ లందిస్తారు… ఏ బీమా సౌకర్యం అందుబాటులో ఉంది.. వీసాల జారీ.. పొడిగింపు, రవాణా తదితర వివరాలుం టాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు హెలీకాఫ్టర్‌ టూరిజంలేదు. పెరిగిన జీవన ప్రమాణాలు… సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు పర్యాటకులు సరికొత్త అనుభూతి చెందేందుకు హెలీకాఫ్టర్‌ టూరిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. తొలుత హైదరాబాద్‌ నుంచి సోమశిల.. అక్కడి నుంచి శ్రీశైలం వరకు హెలీకాఫ్టర్‌ సేవలు ప్రారంభిస్తారు.. పర్యాటకుల ఆదరణ ఆధారంగా దానిని మరింతగా విస్తరిస్తారు.

ముచుకుందా ప్రారంభం
జల విహారాల ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్‌ సాగర్‌లో 120 సీట్ల సామర్థ్యమున్న డబుల్‌ డెక్కర్‌ బోట్‌ను శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. హైదరాబాద్‌కు ఒక నాడు జీవనాడిగా ఉన్న మూసీ అసలు పేరైన ముచుకుందా పేరును ఈ బోట్‌కు పెట్టారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -