Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేడారం మహా జాతరకు కనిపించని సూచిక బోర్డులు

మేడారం మహా జాతరకు కనిపించని సూచిక బోర్డులు

- Advertisement -
  • భక్తులకు తప్పని తిప్పలు..
  • నవతెలంగాణ – కాటారం
  • ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మహ జాతర సమ్మక్క సారక్క జాతర. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా జాతరకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి వెళుతూ ఉంటారు. ఇంత పెద్ద మహా జాతరకు అధికారులు భక్తుల సౌకర్యార్థం సూచిక బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం మరిచిపోయారు. వాహనదారులకు సరైన దారిని చూపించడమే కాకుండా గమ్యస్థానం ఎంత దూరం ఉందో సూచిక బోర్డులు సహాయపడతాయి.

  • అంతేకాకుండా వాహనాల వేగాన్ని నియంత్రించే విధంగా ప్రమాద నివారణ బోర్డులు హెచ్చరికలు జారీ చేస్తాయి. అధికారులు మాత్రం ఇవేమీ పట్టింపు లేకుండా సూచిక, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడంతో కరీంనగర్, మంచిర్యాల,కొమురం భీమ్, హైదరాబాద్,సిరిసిల్ల,సిద్దిపేట్, జగిత్యాల,పెద్దపల్లి జిల్లాల నుండే కాకుండా పక్కనున్న మహారాష్ట్ర చత్తీస్గడ్ రాష్ట్రాల నుండి మేడారం వెళ్లే భక్తులు సూచిక బోర్డులు లేకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. కాటారం మీదుగా మేడారం వెళ్లేందుకు బయలుదేరిన భక్తులు కాటారం మండల కేంద్రంలోని చింతకాని మూలమలుపు వద్ద అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులను అడగాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు.

  • ఇంత పెద్ద మహా జాతరకు సూచిక బోర్డులను అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మేడారం వైపు వెళ్లేందుకు సూచిక బోర్డులను, ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -