Tuesday, June 17, 2025
E-PAPER
Homeజిల్లాలుస్పోర్ట్స్ స్కూల్ లో ప్రవేశాలకు ఆహ్వానం..

స్పోర్ట్స్ స్కూల్ లో ప్రవేశాలకు ఆహ్వానం..

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్ : తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ అకింపేట, ఆదిలాబాద్, కరీంనగర్ నందు నాలుగో తరగతిలో ప్రవేశం కొరకు మండల స్థాయిలో ఎంపికలు నిర్వహించబడతాయని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారి గోడ పత్రికను ఆవిష్కరించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల శాఖ ఆధ్వర్యంలో నడిచే క్రీడా పాఠశాలల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అని, నాలుగో తరగతిలో ప్రవేశం కొరకు మండల స్థాయిలో ఈ నెల 16 నుండి 19 వరకు ఎంపిక నిర్వహించబడతాయని కావున ఆసక్తిగల బాలబాలికలు సంబంధిత మండల విద్యా అధికారిని సంప్రదించాల్సింది తెలంగాణలో మొదటిసారిగా రాష్ట్రంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ http://tgss.telangana.gov.in వెబ్సైట్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని  కలెక్టర్ కోరారు. జిల్లా స్థాయిలో ఈ నెల 25 న ప్రభుత్వ జూనియర్ కళాశాల సూర్యపేట నందు ఎంపిక కార్యక్రమం నిర్వహించబడును అని తెలిపారు. జిల్లా స్థాయిలో హాజరైన బాల బాలికలకు 9 మోటార్ క్వాలిటీ టెస్టులు నిర్వహించబడుతుంది. ఇందులో ప్రతిభ కనబరిచిన 20 బాలురు 20 బాలికలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో జరిగే ఎంపికకు పంపడం జరుగుతుందని తెలిపారు. నాలుగో తరగతి విద్యార్థులు 8 నుండి 9 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి అని పిల్లలు వారి వెంట స్టడీ సర్టిఫికెట్ జనన ధ్రువీకరణ పత్రం ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 3వ తరగతి ప్రోగ్రెస్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం వెంట తెచ్చుకోవాలి అని తెలిపారు.కావున అర్హత ఆసక్తిగల బాలబాలికలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కలెక్టర్  కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, డీఎఫ్ఓ సతీష్ కుమార్, డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, డి ఆర్ డి ఓ వివి అప్పారావు, డి టి డి ఓ శంకర్, డి డబ్ల్యు ఓ నర్సింహరావు, డీఈవోఆశోక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -