నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తి దారుల సంఘం (ఎఫ్ పి ఓ ) ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సభ్యత్వ స్వీకరణ, అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ ఎఫ్ పి ఓ లో చేరేందుకు సభ్యత్వ ఫీజు రూ.2000 కాగా, ప్రతి సభ్యుడు ఈక్విటీ గ్రాండ్ కింద రూ.2000 జమ చేయాల్సి ఉంటుంది. సభ్యులుగా చేరిన రైతులకు భవిష్యత్తులో ప్రభుత్వం అందించే పథకాలు, ఋణ సౌకర్యాలు, మార్కెటింగ్ సహాయం, శిక్షణ కార్యక్రమాలు లభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కావున అర్హత ఉన్న కొలనుపాక గ్రామం రైతులందరూ రైతు ఉత్పత్తి దారుల సంఘంలో పాతసభ్యులు చేరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సెక్రటరీ ఇందూరి వెంకటరెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ ఆరె మల్లేష్ గౌడ్,సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్,ఉప సర్పంచ్ విజయేందర్ రెడ్డి,వార్డ్ మెంబర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



