Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాత్కాలిక పీజీ సీఆర్పీ నర్సింగ్ పోస్ట్ భర్తీకి ఆహ్వానం

తాత్కాలిక పీజీ సీఆర్పీ నర్సింగ్ పోస్ట్ భర్తీకి ఆహ్వానం

- Advertisement -

స్పెషల్ ఆఫీసర్ ఇర్ప పుష్పనీలా 
నవతెలంగాణ – తాడ్వాయి 

ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న తాత్కాలిక పీజీ సీఆర్పీ నర్సింగ్ పోస్ట్ భర్తీకి ఆహ్వానిస్తున్నట్లు కేజీబీవీ తాడ్వాయిస్ స్పెషల్ ఆఫీసర్ పుష్పనీలా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ చదివిన స్థానిక మహిళా అభ్యర్థి, వారి ధ్రువీకరణ పత్రాలతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ కు వ్యక్తిగతంగా దరఖాస్తు సమర్పించాలని కోరారు. పూర్తి వివరాలకు కేజీబీవీ తాడ్వాయి స్పెషల్ ఆఫీసర్ పుష్పనీలా 9490420852 సంప్రదించవచ్చని సూచించారు. 

అలాగే కేజీబీవీ పాఠశాలలో ఇంటర్మీడియట్ సీఈసీ గ్రూప్ నందు స్పాట్ అడ్మిషన్లు ఇంకా జరుగుచున్నట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హత గల విద్యార్థులు సీటు పొందవచ్చు అని తెలిపారు. 6వ తరగతి 10వ తరగతి అడ్మిషన్లు గలవు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -