- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో త్వరలో హైదరాబాద్ లో నిర్వహించే సభకు హాజరుకావాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చారు. సభకు తప్పకుండా వస్తానని మంత్రి తెలిపారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగ రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మురళి, కొండగర్ల శీను, ఇప్ప వెంకటేశ్, నరసింహులు, భాష, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -