నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలో గల తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాల యందు 2025 -26 సంవత్సరానికి గాను గంటల పిరియడ్ వేతన చెల్లింపులతో బోధించుటకు ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నందాల గంగ కిషోర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల మరియు కళాశాలలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో 2025 – 26 విద్యా సంవత్సరానికి బోధించుటకు తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, ఫిజికల్ సైన్స్ , జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సబ్జెక్టులకు బోధించుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 29 లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని అన్నారు. బోధనతోపాటు స్టాఫ్ నర్స్ పోస్టు కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. అభ్యర్థులు పైన తెలుపబడిన విషయంలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా బీఈడీ లలో కనీసం సెకండ్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణుల ఉండాలని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు గురుకుల పాఠశాల మరియు కళాశాల సమయం నియమాలకు కట్టుబడి పని చేయడానికి ఆసక్తి కలిగి ఉండవలెనని సూచించారు. దరఖాస్తులు చేసుకునేవారు ఈనెల 29 లోపు కళాశాల లో అందజేయాలని పూర్తి వివరాలకు ఫోన్ నెంబర్7331101386 సంప్రదించవలసిందిగా ప్రిన్సిపాల్ కోరారు.
అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఆహ్వానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES