- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
జనజాగృతి కళాసమితిలో అంతర్భాగమైన కవి సాయంత్రం సోషల్ మీడియా గ్రూపు 11వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఉత్సాహకులైన కవులు రచయితల నుండి రచనలను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ముక్కెర సంపత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలకు కోరారు. గేయం, పద్యం, వచనం ఏ ప్రక్రియలోనైనా రచనలు పంపవచ్చుమని తెలిపారు. 25 లైన్లకు మించి ఉండరాదని తెలిపారు. వేరే గ్రూపులో పంపి పరిశీలనలో ఉన్న వాటిని ఈ పోటీకి పంపరాదని, హామీ పత్రం తప్పకుండా జత పరచాలన్నారు. గడువు 10 జనవరి 2026 వరకు రచనలను 9441797207 నెంబరుకి వాట్సప్ చేయాలని తెలిపారు. గడువులోగా వచ్చిన రచనలలో ఉత్తమమైనవి ఎంపిక చేసి కవితాసంకలనంగా వెలువరిస్తామని పేర్కొన్నారు.
- Advertisement -



