Thursday, April 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దమ్మ తల్లి ఉత్సవాలకు ఆహ్వానం

పెద్దమ్మ తల్లి ఉత్సవాలకు ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
దోమకొండ పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న పెద్దమ్మ తల్లి ఉత్సవాలకు భిక్కనూర్ మాజీ జెడ్పీటీసీ, కామారెడ్డి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రమేష్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం నంద రమేష్ మాట్లాడుతూ ముదిరాజ్ సమాజాన్ని ప్రభుత్వం గుర్తించి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దోమకొండ పట్టణ అధ్యక్షులు నగరపు నారాయణ, సభ్యులు పున్న లక్ష్మణ్, అబ్రబోయిన స్వామి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -