- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జైపూర్‌లో ఏప్రిల్ 19న LSGతో జరిగిన మ్యాచ్‌లో RR అనూహ్య ఓటమి ఫిక్సింగ్ ఆరోపణలకు దారితీసింది. RR మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(RCA) అడ్‌హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. హోం గ్రౌండ్‌లో గెలుపు ఖాయమనుకున్న దశలో ఎలా ఓడిపోయిందంటూ ప్రశ్నించారు. వెంటనే విచారణ చేపట్టాలన్నారు. RR యాజమాన్యం RCAను పక్కన పెట్టిందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.