Saturday, January 10, 2026
E-PAPER
HomeఆటలుIPL: రూ.25 కోట్ల ధర పలికినా… గ్రీన్‌కు దక్కేది రూ.18 కోట్లే!

IPL: రూ.25 కోట్ల ధర పలికినా… గ్రీన్‌కు దక్కేది రూ.18 కోట్లే!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ వేలం చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఏకంగా రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. అయితే, వేలంలో రికార్డు ధర పలికినప్పటికీ, అతనికి ఈ పూర్తి మొత్తం అందదు. ఐపీఎల్ కొత్త నిబంధన ప్రకారం గ్రీన్ చేతికి వచ్చేది రూ. 18 కోట్లు మాత్రమే.

ఏమిటీ కొత్త నిబంధన?
గత ఏడాది ఐపీఎల్ ప్రవేశపెట్టిన ‘గరిష్ఠ రుసుము’ (maximum fee) నిబంధనే దీనికి కారణం. మినీ వేలంలో కొందరు విదేశీ ఆటగాళ్లు డిమాండ్-సప్లై వ్యత్యాసాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ రూల్ తీసుకొచ్చారు. దీని ప్రకారం, మినీ వేలంలో ఒక విదేశీ ఆటగాడికి గరిష్ఠంగా రూ. 18 కోట్లకు మించి చెల్లించకూడదు. ఒకవేళ వేలంలో అంతకుమించి ధర పలికితే, ఆ అదనపు మొత్తాన్ని (ఇక్కడ రూ. 7.20 కోట్లు) బీసీసీఐ ఆటగాళ్ల సంక్షేమానికి వినియోగిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -