- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత్– పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 నిర్వహించడం సరికాదని నిర్ణయించింది. ఐపీఎల్ లీగ్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం ఉదయం జరిగిన సమావేశంలో వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ లీగ్ దశలో భాగంగా ఇంకా 12 మ్యాచ్‌లున్నాయి. లక్నో, హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబయి, జైపుర్ నగరాలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.
- Advertisement -