నవతెలంగాణ-హైదరాబాద్: హర్యానా సీనియర్ ఐపిఎస్ అధికారి పురాన్ కుమార్ తనను తాను కాల్చుకుని ఆత్మ హత్య చేసుకున్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం చండీగఢ్‌లోని సెక్టార్ 11లోని తన నివాసంలో ఆయన గన్‌తో కాల్చుకున్నారని అన్నారు. ఎస్‌హెచ్‌ఒ మరియు ఆయన బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (సిఎఫ్‌ఎస్‌ఎల్) బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తోందని, దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కున్వర్‌దీప్ కౌర్ తెలిపారు.
2001 బ్యాచ్ అధికారి అయిన పురాన్‌కుమార్, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 29న రోV్‌ాతక్‌లోని సునారియాలోని పోలీస్ శిక్షణా కేంద్రం (పిటిసి)లో నియమితులయ్యారు. ఆయన భార్య అమన్ ఐఎఎస్ అధికారి. ఆమె ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. బుధవారం సాయంత్రం భారత్‌కు తిరిగి రానున్నారు.