Monday, March 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం16 బాలిస్టిక్‌ మిస్సైళ్లు, 117 డ్రోన్లతో ఇరాన్‌ దాడి

16 బాలిస్టిక్‌ మిస్సైళ్లు, 117 డ్రోన్లతో ఇరాన్‌ దాడి

- Advertisement -

యూఏఈ వెల్లడి
అబుదాబి :
16 బాలిస్టిక్‌ క్షిపణులు, 117కి పైగా డ్రోన్లతో ఇరాన్‌ తమపై దాడి చేసిందని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఆదివారం తెలిపింది. అయితే తమ రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తం 16 క్షిపణులను అడ్డుకుందని, కాగా ఓ క్షిపణి సముద్రంలో పడిందని యూఏఈ పేర్కొంది. మెజారిటీ డ్రోన్లను తాము కూల్చివేశామని, కాకపోతే నాలుగు డ్రోన్లు మాత్రం తమ భూభాగంలో పడ్డాయని వెల్లడించింది.
నార్వేలోని యూఎస్‌ ఎంబసీ వద్ద భారీ పేలుడు
ఐరోపా దేశం నార్వేలోని యూఎస్‌ ఎంబసీ ప్రవేశ ద్వారం వద్ద పేలుడు సంభవించింది. ఈ క్రమంలో భారీ శబ్దం వినిపించిందని.. పెద్దఎత్తున పొగ వ్యాపించిందని పోలీసులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగన ఈ పేలుడుతో స్వల్ప నష్టం వాటిల్లినట్టు వారు తెలిపారు. అయితే, ఎవరూ గాయపడలేదని స్పష్టం చేశారు. ఈ పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి అమెరికా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో నార్వేలోని యూఎస్‌ ఎంబసీ వద్ద పేలుడు చోటుచేసుకోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -