నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. యురేనియం శుద్ధిపై ఎవరి అనుమతి అవసరం లేదని వ్యాఖ్యానించారు. గతేడాది హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్మారక కార్యక్రమంలో ఖమేనీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యురేనియం శుద్ధి అపరిమితంగా తయారుచేయడానికి మేము అనుమతించమని వారు (అమెరికాను ఉద్దేశిస్తూ) అంటున్నారు. ఇది పూర్తిగా అర్థం లేనిది. ఒకరి అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం ఇరాన్‌కు లేదు. మా సొంత విధానాలు మాకు ఉన్నాయి. వాటికి కట్టుబడి ఉంటాం. ప్రస్తుత తరహాలోనే రైసీ హయాంలో కూడా పరోక్ష చర్చలు జరిగాయి. అయితే వాటిల్లో ఎలాంటి ముందడుగు పడలేదు. ప్రస్తుత చర్చల నుంచి కూడా మేము ఎక్కువగా ఆశించడం లేదు. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు’ అని ఖమేనీ పేర్కొన్నారు.
యురేనియం శుద్ధిపై ఎవరి అనుమతి అవసరం లేదు: ఇరాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES